25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జాతీయ రహదారిపై ప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

. . . మోటార్ సైక్లిస్ట్ దుర్మరణం

 ఇందల్వాయి, బతుకమ్మ :

జాతీయ రహదారిపై జరుగుతున్న పనులు ఓకరి ప్రాణాలను తీసాయి. సర్వీస్ రోడ్డు పనులు జరుగుతుండగా రోడ్డు పక్కన పెట్టిన మట్టి సంచులకు బైక్ డికోని  దానిని నడుపుతున్న వ్యక్తి కిందపడగా అతనపై నుంచి కంటైనర్ వెల్లడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన 44 వ నంబర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ధ అదివారం ఉదయం జరిగింది. ఇందల్వాయి పోలీసుల కథనం ప్రకారం… మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు  (32) తన బైక్ పై కామారెడ్డి మీదుగా నిజామాబాద్ వస్తుండగా చంద్రయాన్ పల్లి వద్ధ సర్వీసు రోడ్డు పనుల కోసం ఎర్పాటు చేసిన మట్టి బ్యాగ్ లను డికోట్టాడు. ఈ సంఘటనలో కిందపడిన నాగరాజును కంటైనర్ డికోట్టి దూసుకుపోయింది. ఈఘటనలో నాగరాజు  అక్కడికక్కడే చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు.

 

More articles

Latest article