27.5 C
Hyderabad
Friday, July 31, 2026

 కవిత రాజీనామా ఆమోదం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అమోదించిన శాసన మండలి చైర్మన్

 హైదరాబాద్, బతుకమ్మ :

కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందింది. కవిత రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే ఆమె తన పదవికి మండలి చైర్మన్ ఫార్మెట్ లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న శాసనమండలి సమావేశాలకు హాజరైన కవిత తన చివరి సమావేశం హాజరుగా పేర్కొంటూ తన రాజీనామాను అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కవిత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాకు ఆమోద ముద్ర పడినట్టు మండలి కార్యదర్శి నరసింహ చార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. దానితో కవిత మాజీ గా మారారు.మండలిలో తన పదవికి రాజీనామా ను ఆమోదించాలని కోరుతూ తాను రాజకీయ పార్టీ స్థాపన చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను వ్యక్తిగా సభలో నుంచి వెళుతున్నానని తిరిగి శక్తిగానే హౌస్ లో అడుగుపెడుతానని ప్రకటించారు. మంగళవారం కవిత రాజకీయ పార్టి ప్రకటన పై తెలంగాణ జాగ్రుతి భవిష్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

బి ఆర్ ఎస్ కు వచ్చి రాని నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవి…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం బి ఆర్ ఎస్ పార్టికి వచ్చి రాలేదని చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నాడు ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నేత డాక్టర్ భూపతి రెడ్డి  నామినేషన్ల ఉపసంహరణ డ్రామాల అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తన పదవీకాలం పూర్తి చేయకముందు అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో విభేదాలతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. చివరకు ఉప ఎన్నికలు నిర్వహించగా అప్పటికే 2019 లో ఎంపీగా ఓటమి చవి చూసిన కల్వకుంట్ల కవిత గెలుపోంది 13 నెలల పదవీకాలం పూర్తి చేశారు. 2021 లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 లో నిర్వహించిన బిఆర్ఎస్ రజతోత్సవ ఆవిర్భావ సభ పై కవిత అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం అది లీక్ కావడంతో కలకలం రేపింది.  బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరిష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుల లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్ లో పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. తర్వాత నుంచి కవిత తెలంగాణ జాగృతి ద్వార ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

మరోసారి నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక…..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా చేయడం దానికి ఆమోదం లభించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత సెప్టెంబర్ లో కవిత రాజీనామా చేసిన నాటి నుంచి మండలి చైర్మన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. చివరగా శీతాకాలం మండలి సమావేశాలకు హాజరైన కవిత రాజీనామా ఆమోదించాలని కోరడంతో 24 గంటల్లో ఆమోదించారు. కవిత రాజీనామా చేసినప్పుడు  ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవీ కాలం మరో 22 నెలలు ఉంది.  ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యం గా ఉంది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయితే గాని ఉప ఎన్నిక జరగదని చెప్పాలి. అదే విధంగా కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉప ఎన్నికల్లో కొత్తవారే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Acceptance of Kavitha's resignation

More articles

Latest article