నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయాల అవినీతికి అడ్డాలుగా మారయనే ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో దళారుల ప్రమేయం ఎక్కువైందని, ప్రజలకు రవాణాశాఖ సేవలు నేరుగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లైసెన్సులు, రెన్యువల్స్, వాహనాల ఫిట్ నెస్ తదితర పనుల నిమిత్తం వచ్చే వారిని మధ్యాహ్నం 2గంటల వరకు లోనికి అనుమతించడం లేదని, అంతా దళారులే నడిపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ తోపాటు అటెండర్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
