24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రామన్నపేట్ లో గ్రామ దేవతలకు అభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : వరణ దేవున కలిగి వర్షాలు కురువాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ శుక్రవారం మండలంలోని రామన్నపేట్ లో గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవతలకు అభిషేకం చేశారు. ఈ సందర్బంగా సంఘానికి ఇద్దరు చొప్పున మహిళలు, పురుషులు గంగ జలాన్ని తెచ్చి మంగళహారతులు, దప్పులతో గ్రామంలోని అన్ని దేవాలయాల్లో ఉన్న దేవతలకు అభిషేకం నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రామ కమిటీ నుండి ప్రారంభమైన ఈ అభిషేక కార్యక్రమంను గ్రామంలో గల హనుమాన్ మందిరంలో హనుమంతునికి అభిషేకంను చేసి, పక్కనే గల దసరా గోడ వద్ద గల గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. అక్కడి నుండి పాటిమిది హనుమాన్ మందిర్, సొసైటీ వెనుక గల గ్రామదేవత కు, అయ్యల స్వామి గ్రామాలయం జంగం మఠం వద్ద నుండి భూలక్ష్మి అమ్మవారికి, బస్ స్టాండ్ లో పోషవ్వలకు, ఐదు చేతుల పోషమ్మ, మహాలక్ష్మిమ్మ, తాతా అయిలకు, గుండెలవ్వ, పెద్దమ్మ, రామాలయం  శుక్రరాం దేవి, సంతోషిమత, మల్లన్న గుడి, అయ్యల గుట్ట వద్ద శ్రీ వీరభద్రునికి గంగ జలంతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. అన్ని ఆలయాల్లో అభిషేక్కానంతరం బెల్ల అన్నం, కొబ్బరికాయ నైవేద్యలను దేవతలకు నివేదన చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ కార్యవర్గం, వివిధ సంఘాల సభ్యులు, మహిళలు, గ్రామ వాతాన్ దారులు తదితరులు పాల్గొన్నారు.

Abhishekam to the village deities in Ramannapet

More articles

Latest article