రాష్ట్రంలో ఒక్కరోజే నాలుగు చోట్ల ఏసీబీ దాడులు
లంచం తీసుకుంటు పట్టుబడిన కార్మిక శాఖాధికారులు లంచం అడిగిన ములుగు డిప్యూటీ తహసీల్దార్ పై కేసు పాల్వంచ మున్సిపాల్టి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలో లెక్కలో లేని నగదు స్వాధీనం హైద్రాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఆరు నెలల్లో 120 మందికిపైగా అవినీతి అధికారులను పట్టుకుంది. ఐనప్పటికీ లంచాలు తీసుకోవడం మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం ఒక్కరోజే నాలుగు ప్రాంతాలలో దాడులు చేసింది. ముగ్గురు అధికారులు లంచాలు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుబడగా, ఒక చోట ఆకస్మిక...