ఏసీబీ ఎఫెక్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వాహనదారులు ఏజెంట్లతో సందడిగా ఉండేది. గురువారం ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి ఆర్టీఏ ఏజెంట్ నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సందర్శకులు, ఏజెంట్లు లేక బోసిపోయింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట 50 వరకు ఏజెంట్ల కార్యాలయాలు ఉండగా అక్కడ వాహనాదరులు లేక సందడి తగ్గింది. అధికారులు సైతం ఆలస్యంగా...