27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఏబీవీపీ ప్రపంచంలోనే విశిష్టమైన విద్యార్థి సంస్థ

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ కుమార్
  • ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఉచిత బోధన శిక్షణ తరగతుల ప్రారంభం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  అఖిల భారతీయ విద్యార్థి  పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విశిష్టమైన విద్యార్థి సంస్థ అని జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం పాలిటెక్నిక్ ఉచిత బోధన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని కవిత కాంప్లెక్స్ లో గల ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మెటీరియల్ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమానికి డీఈఓ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులలో దేశభక్తి జాతీయ భావాలు పెంపొందిస్తూ ఎంతోమంది దేశభక్తులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.  1949 లో ఏబీవీపీ ఆవిర్భావం నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాల్లో భాగంగా పాలిటెక్నిక్ ఉచిత బోధన తరగతిలో నిర్వహిస్తుందని తెలిపారు.  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు పెడుతున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ను అభినందించారు. ఇందూరు విభాగ్ ప్రముఖ రెంజల్రా నరేష్ మాట్లాడుతూ

ABVP is a unique student organization in the world.

1982లో కేవలం రెండు కేంద్రాలలో ప్రారంభమైన ఈ బోధన తరగతులు నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అనేక కేంద్రాలలో బోధన తరగతులు అందిస్తూ వేలాదిమంది విద్యార్థులను ఉన్నత లక్ష్యాలకు చేరుస్తుందన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరుచుకోవాలని సూచించారు. ఏబీవీపీ అంటే కేవలం ఆందోళన కార్యక్రమాలు కాదని, ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తూ  ఎందరో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు చూపుతుందని తెలిపారు. అలాగే మన దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జయంతులు, వర్ధంతిలు చేస్తూ విద్యార్థులలో సమాజంలో దేశభక్తిని నింపుతుందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతుందని, దేశంలో 864 యూనివర్సిటీలలో ఏబీవీపీ విద్యార్థుల కోసం పని చేస్తుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, ఇందూరు విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, ఇందూరు జిల్లా వ్యవస్థ ప్రముఖ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు వెంకటకృష్ణ ,కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్,  ఉచిత పాలిటెక్నిక్ తరగతుల కన్వీనర్ సాయి, రంజిత్, బాలకృష్ణ, సునీల్, రాకేష్, అభినవ్, సాత్విక్, గోపి, రాజ్, గణేష్, నవీన్, రంజిత్, ఇంద్రసేన తదితరులు పాల్గొన్నారు.

ABVP is a unique student organization in the world.

More articles

Latest article