బోధన్, బతుకమ్మ : తెలంగాణ విద్యార్ధి పరిషత్ అధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడాడుతు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడుతున్నారాని, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి అయిన తర్వాత వారి యొక్క సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి వచ్చిందని అన్నారు. అటు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ ను విడుదల చేయకపోవడం, విద్యార్ధులు డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. చెదువుకోలేక మద్యలోనే ఆపేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవటం సిగ్గు చేటు అని అన్నారు. లేని యెడల రానున్న రోజుల్లో ఎమ్మెల్యే లు, మంత్రులు రోడ్ ల పైనా ఎలా తిరుగుతారో మేము చూస్తాం అని హెచ్చరించారు. ఎక్కడిక్కడ వారి కన్వాయిలను అడ్డుకుంటామని అలాగే రానున్నా రోజుల్లో జెడ్‌పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికలలో విద్యార్థుల పవర్ ఏంటో చూపిస్తాం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పంధించి పెండింగ్ లో వున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, బోధన్ పట్టణ కార్యదర్శి వీరేష్, విశాల్, నవదీప్, మహేష్, సాయి కృష్ణ, సాయి చరణ్, విఘ్నేష్, మణి విద్యార్థులు పాల్గొన్నారు.
