29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నేత్రదానం చేసిన తోట గంగమ్మ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన తోట గంగవ్వ అనే మహిళ బుధవారం సహజంగా మరణించింది. ఆమె మనవడు పార్వతి ప్రశాంత్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ సభ్యులుగా ఉన్నారు. ఆయన క్లబ్ సభ్యులకు సమాచారం అందించి వారి అమ్మమ్మ నేత్రాలను దానం చేస్తే ఇద్దరి అందులకు కళ్ళు దానం చేయవచ్చునని మంచి నిర్ణయంతో క్లబ్ సభ్యుల సహకారంతో లయన్స్ క్లబ్స్ వారికి  నేత్రాలను దానం చేశారు. ఈసందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారు మాట్లాడుతూ.. ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయమని, చనిపోయిన తరువాత శరీరం కాళీ బుడిదై మట్టిలో కలిసిపోతే పనికొచ్చేది ఏముండదని ఇలా దానం చేస్తే ఇద్దరి అందులకు కళ్ళ ప్రదానం చేసేవాళ్ళం అవుతామని లయన్ ప్రశాంత్ సహకారంతో ఇంతటి గొప్ప సేవ చేసినందు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. చనిపోయిన తోట గంగవ్వకు దేవుడు స్వర్గలోకప్రాప్తి కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యామ్ సుందర్ పహడే, కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, సభ్యులు లయన్ గాండ్ల మధు పుట్టి సాగర్, లయన్ ఓరికే సతీష్, గుండూరు శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర్, గంధపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article