26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పీజీ పరీక్షలు వాయిదా వేయాలని ఏబీవీపీ ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రెగ్యులర్ పీజీ 2,4 పరీక్షలు సిపిజిఈటి ప్రవేశ పరీక్ష కారణంగా పోస్ట్ పోన్ చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫీస్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏబీవీపీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సానుకూలంగా స్పందించి పరీక్షలు పోస్ట్ ఫోన్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.  అఖిల భారతీయ  విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే   పీజీ సెమిస్టర్ పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ మాట్లాడుతూ సిపిజిఈటి పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించే తేదీలలోనే ఆగష్టు 4 నుండి 11 వరకు ఉండడం చేత పీజీ ఎంట్రెన్స్ రాసే   విద్యార్థులకు ఇబ్బంది అవుతున్నాయన్నారు. పోస్ట్ చేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులతో కంట్రోలర్ ఆఫీస్ ముట్టడించినట్లు తెలిపారు. బ్యాక్లాగ్ పరీక్షలు రెగ్యులర్ పరీక్షలతో పెట్టడం వల్ల రెండు రాసే విద్యార్థులకు ఒకేరోజు రెండు పరీక్షలు ఉండడం వల్ల చదవడం, రాయడం ఇబ్బంది అవుతుందని బ్యాక్ లాక్ ఎగ్జామ్ లు రెగ్యులర్ ఎగ్జామ్స్ కంటే ముందే పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు యూనివర్సిటీ అధికారులు తలొగ్గి పీజీ 2,4 రెగ్యులర్ పరీక్షలను సిపిజిఈటి పరీక్షల తర్వాత నిర్వహిస్తామని, బ్యాక్లాగ్ పరీక్షలని రెగ్యులర్ పరీక్షల కంటే ముందే నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతాచారి,యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్,యూనివర్సిటీ నాయకులు సమీర్ అజయ్ అక్షయ్ రాకేష్ అశోక్ నవీన్ పృద్వి లెనిన్ రోహన్ శివ మరి విద్యార్థులు పాల్గొన్నారు.

ABVP dharna demanding postponement of PG exams

More articles

Latest article