నిజామాబాద్, బతుకమ్మ: నేషనల్ లెవల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో జిల్లా కు చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటి పతకాలు సాధించారు. కేరళ రాష్ర్టంలో గత నెల 31 నుంచి ఈనెల 3వ తేదీ వరకు నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ లో జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ర్ట తరఫున ప్రాతినిథ్యం వహించారు. రాష్ర్టాన్ని ద్వితీయ స్థానంలో నిలిపి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
లాంగ్ జంప్ లో దినేశ్ వాగ్మారే సిల్వర్ మెడల్, హార్డిల్స్ లో గోపి సిల్వర్ మెడల్, హై జంప్ లో ఎస్ వెంకటేశ్ బ్రాంజ్ మెడల్, షాట్ ఫుట్ లో రఘు వీర్ బ్రాంజ్ మెడల్, 5కే రన్ లో ఎం నర్సయ్య గోల్డ్ మెడల్, అమీర్ అలీ సిల్వర్ మెడల్, 400, 800 మీటర్స్ లో పద్మ గోల్డ్ మెడల్, హై జంప్ లో సౌజన్య గోల్డ్ మెడల్, జావెలిన్ త్రోలో స్రవంతి బ్రాంజ్ మెడల్, ట్రిపుల్ జంప్ లో షడ్రక్ బ్రాంజ్ మెడల్, గోపి సిల్వర్ మెడల్, దినేశ్ బ్రాంజ్ మెడల్, 100 మీటర్స్ రిలే లో సిల్వర్ మెడల్, 400 మీటర్స్ హార్డిల్స్ లో పల్లవిరెడ్డి గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్ లో సౌజన్య గోల్డ్ మెడల్, స్రవంతి బ్రాంజ్ మెడల్, 400 మీటర్స్ హార్డిల్స్ లో గోపి గోల్డ్ మెడల్, 100 మీటర్స్ లో దినేశ్ వాగ్మారే బ్రాంజ్ మెడల్, హ్యమర్ త్రోలో జి రఘువీర్ బ్రాంజ్ మెడల్, 5కే రన్ లో ఎల్ పద్మ సిల్వర్ మెడల్ సాధించారు.
