28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లా యువకుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

విషాదాన్ని మిగిల్చిన బోటు ప్రయాణం సరదా

వెబ్ న్యూస్, బతుకమ్మ : ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.  కుటుంబంతో సరదాగా సముద్రంలో బోటు ప్రయాణం చేసి, ఒడ్డుకు రాగానే అలల దాటికి యువకుడు కొట్టుకుపోయాడు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము (34) అనే యువకుడు, ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయి యువకుడు మరణించాడు. కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article