27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బోధన్‌లో డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు బోధన్ టౌన్ సీఐ వెంకట్ నారాయణ  ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ వెంకట్ నారాయణ మాట్లాడారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలపై పడే ప్రభావం, నేరాలకు దారితీసే ప్రమాదాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ హెచ్ వో వెంకట నారాయణ, విద్యా వికాస్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్, టాక్సీ డ్రైవర్లు, పట్టణ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article