24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అప్పుల వేదింపులు భరించలేక అశోక్ సాగర్ లో దూకి యువకుడి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

. . . సచ్చినా పర్వాలేదు

. . . అప్పులకు వడ్డీలు కట్టాల్సిందే

. . . మామా అల్లుళ్ల  వేదింపులతో ఆశోక్ సాగర్ లో దూకి వ్యక్తి అత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :                                                                                                                                                    

అప్పులు ఇచ్చిన వారి వేదింపులు తాళలేక రెండు నెలల క్రితం యువకుడు విషం తాగిన వేదింపులు ఆగలేదు. సోదరి బంగారాన్ని కుదవపెట్టి డబ్బులు మూడు లక్షల వరకు ఇచ్చినా అవి వడ్డికే పరిమితం అవుతాయని మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తావని  మామ ఆలుళ్ళు వేదించడంతో యువకుడు అశోక్ సాగర్ లో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇందులో దారుణం ఏమిటంటే మామ పోలీసు శాఖలో పని చేస్తూ యువకుడిని పలుమార్లు పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా యువకుడిని రోజుల పాటు పోలీస్ స్టేషన్ ల చుట్టు తిప్పుతూ డబ్బులు చెల్లించేందుకు ఒప్పించడం దారుణం. బుధవారం ఉదయం అశోక్ సాగర్ లో ఆటోనగర్ కు చెందిన సయ్యద్ హబీబ్ అజర్ (32) శవమై తేలాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన అజర్ అశోక్ సాగర్ లో దూకి  బలవన్మరణానికి కారణం అప్పులు ఇచ్చిన వారి వేదింపులే కారణమని తెలిసింది. పూలాంగ్ కు చెందిన షేక్ అర్షద్ ఆలీ అనే యువకుడి నుంచి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం అజర్ అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. తర్వాత వ్యాపారంలో నష్టం రావడంతో తీసుకున్న డబ్బులకు గాను వడ్డీలు, చక్రవడ్డీలు ఇవ్వాలని అర్షద్ ఆలీ వేదింపులు పెరిగాయి. అర్షద్ ఆలీ మామ పోలీసు పోలీసు శాఖలో ఏఎస్సై కావడంతో పలుమార్లు అజర్ ను పోలీస్ స్టేషన్ కు రప్పించ బలవంతంగా డబ్బులు వసూల్ కు ప్రయత్నం చేశారు. రెండు నెలల క్రితం అజర్ వేదింపులు భరించలేక విషం తాగాడు. అయినప్పటికి వేదింపులు తగ్గకపోవడంతో తన వద్ద ఉన్న లక్ష రూపాయలతో పాటు తన సోదరి బంగారు నగలను తాకట్టుపెట్టి మరో రెండు లక్షలు మొత్తంగా రూ.3 లక్షలు చెల్లించారు. అయితే అప్పు తీసుకున్న సమ యానికి చెల్లించే సమయానికి వ్యత్యాసం ఉందని, అధిక వడ్డీ కావాలని అజర్ ను మామా అల్లుళ్లు వేదించినట్లు తెలిసింది. ఇటీవల వారి వేదింపులు భరించలేక రెండు రోజుల క్రితం కూడా రూ.20 వేలు చెల్లించినట్లు తెలిసింది. అజర్ కు గడువు ఇచ్చి డబ్బులు కట్టాలని లేకపోతే నువ్వు సచ్చిన పర్వాలేదు పైసలు మాత్రం వసూల్ చేస్తామని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More articles

Latest article