- అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) కోటేశ్వర రావు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ అదనపు డిసిపి (అడ్మిన్) కోటేశ్వర రావు అన్నారు. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూశర్మ ఆదేశాల నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మెడికవర్ హస్పటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో బుధవారం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిధులుగా అదనపు డి.సి.పి (అడ్మిన్) కోటేశ్వర రావు, అదనపు డి.సి.పి (లా అండ్ ఆర్డర్) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్) శంకర్ నాయక్ హజరయ్యారు. ఈ సందర్భముగా అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్) మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడు విధుల నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యం పై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఏంతో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని ,మనం తీసుకునే అన్నిరకాల ఆహర పదార్ధలలో కల్తీ చాలా ఉందని తెలిపారు. కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాదునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ప్రత్యేకంగా ఇ.సి.జి, 2 డిఈకో, బిపి, కంటి కరీక్ష, రాండమ్ బ్లడ్ షుగర్, సి.బి.పి ( కంప్లీట్ బ్లడ్ పిక్చర్) దంత పరీక్షలు మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వి నియోగం చేసుకోవాలని, ప్రతీ సంవత్సరం ఒక్కసారైన మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. మందులు వాడేదానికంటే ముందుజాగ్రతలు తీసుకోవడం మంచిదని అన్నారు. ఇలాంటి క్యాంప్ ల ఏర్పాటు చేయడం ఎంతో అభినందని యమని అన్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది, పోలీస్ కార్యలయం సిబ్బంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్సు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాదాపు 370 మంది సిబ్బంది పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్, బోధన్, స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పిలు, రాజా వెంకట్ రెడ్డి, పి. శ్రీనివాసులు, ఎస్. శ్రీనివాస్ రావ్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ తిరుపతి (ఎమ్.టి.ఓ), శ్రీనివాస్ ( వెల్ఫేర్ ) పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డా॥ సరళ, దేవాగౌడ్ పోలీస్ స్టాఫ్, డాక్టర్లు సందీప్ రావ్ (కార్డియాలజిస్ట్)), ప్రశాంత్ (పర్మనాలజిస్టు, దత్తు రాజు ( జనరల్ మెడిసిన్ ), కౌశిక్ ( జనరల్ సర్జన్), రామకోటేశ్వర రావ్ (ఆర్థోపెడిక్) సుష్మ నాగసూరి ( గైన కలజిస్టు), అజయ్ కుమార్ ( కిడ్ని ) సాంబశివరావ్ ( డెంటల్) వెంకట్ (పిడియాట్రిక్ ), వెంకటేశ్ ( కంటి వైద్యులు) సిబ్బంది, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పాల్గొన్నారు.

