28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు పోలీస్ కమిషనర్(అడ్మిన్) పి. కోటేశ్వరరావు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ జాగృత దివస్ కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్ ను చైతన్యం చేయాలని అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) పి.కోటేశ్వరరావు సూచించారు.    తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా బుధవారం నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచనలమేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని  కాన్ఫరెన్స్ ల్లో  సైబర్ జాగృత దివాస్ నిర్వహించారు.  ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) పి.కోటేశ్వరరావు మాట్లాడారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, సీనియర్ సిటిజన్  కు సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా పని చేయడం జరుగుతుందని తెలిపారు. సాంకేతిక పద్దతులకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపధ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క అవశ్యకత చాలా ఉన్నదని, ఇందు కోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి 1930 ద్వారా కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని, ప్రధానంగా భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని అన్నారు. మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణం నిలిపి వేసి సంబంధిత వారి యొక్క ఖాతా ను ఫ్రీజ్ చేసే విధంగా చూడవచ్చని తెలిపారు. సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించడం జరుగుతుందని, వారికి శిక్ష పడేలా చేయడం తద్వారా భాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కు డిజిటల్ అరెస్టు స్కామ్స్, ఇన్వేస్టుమెంటు (స్టాక్) ఫ్రాడ్స్, ఇంపర్సొనేషన్ (వేషదారణ) ఫ్రాడ్స్ మొదలగు వాటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఇందుకోసం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రజలకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.   ఈ కార్యాక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆహ్వనితులకు అవగాహన కల్పించారు.  ఈ కార్యాక్రమంలో సైబర్ క్రైమ్ ఎ.సి.పి వై. వెంకటేశ్వర రావు, నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, నిజామాబాద్ సీనియర్ సిటిజన్ ఫారం అధ్యక్షులు, సీనియర్ సిటిజన్స్, పోలీస్ కార్యాలయం సిబ్బంది. సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Senior citizens should be sensitized

More articles

Latest article