బతుకమ్మ: బిచ్కుంద : సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్జీటీయూ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో పలువురు మహిళ టీచర్లను సన్మానించడం జరిగిందని సంఘ బాధ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా దత్త నగర్ ఎంపీపీఎస్ కు చెందిన ఈ.సంగీత, కందర్ పల్లి ఎంపీపీఎస్ కు చెందిన కళ్యాణి, గుండె నెమలి ఎంపీపీఎస్ కు చెందిన ముద్రిక, హాస్గుల్ ఉర్దూ మీడియం ఎంపీపీఎస్ కు చెందిన ఫైముద, రాజుల్ల ఎంపీపీఎస్ కు చెందిన రాంబాయి, దౌల్లాపూర్ ఎంపీపీఎస్ కు చెందిన ఎం.శోభారాణి లను సన్మానించినట్లు ఎస్జీటీయూ సంఘం బాధ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ జి టి యు రాష్ట్ర కార్యదర్శి విజయ్ పాటిల్, ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం బ్రహ్మానందం, ఎస్ జి టి యు బిచ్కుంద మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఖయ్యూం, టీ మారుతి, అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సంతోష్, ఉపాధ్యక్షులు రవి జాదవ్ తదితరులు పాల్గొన్నారు.