29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిమ్న జాతుల అభివృద్ధికి సావిత్రిబాయి పూలే కృషి

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : స్త్రీ సంస్కర్త, రచయిత్రి ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే నిమ్నజాతుల అభివృద్ధికి విశేషంగా కృషి చేసిందని భీమ్ గల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.సతీష్ కొనియాడారు. శుక్రవారం భీమ్ గల్ డిగ్రీ కాలేజ్ లో సావిత్రిబాయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆమెకు నివాళులార్పించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన దేశంలోనే మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయిని అయినా ఆమె స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉద్యమకారిణీ అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుదర్శన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article