26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మనసుకవి ఆత్రేయకు ఘన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

  • కవి కంకణాల రాజేశ్వర్

 

భీమ్ గల్, బతుకమ్మ : పాటల మాంత్రికుడు, సినీ వేమన,  తత్వవేత్త, కవి, రచయిత, నిర్మాత, సినీ దర్శకుడు, జమీన్ రైతు పత్రిక అసిస్టెంట్ డైరెక్టర్, నాటిక, నాటక, సినిమా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన  మనసు కవి ఆచార్య ఆత్రేయ ఘన నివాళిని అర్పించారు. శనివారం  ఆత్రేయ 68 వ వర్ధంతిని పురస్కరించుకొని భీమ్ గల్ పట్టణం లో ఆత్రేయ చిత్రపటానికి పూలవేసి, జ్యోతిని వెలిగించి శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘన నివాళిని అర్పించారు. సందర్బంగా కవి కంకణాల మాట్లాడుతూ ఆచార్య ఆత్రేయ 1921 మే 7న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడన్నారు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. ఆత్రేయ చిన్నప్పటినుండి నాటకం లోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారని, సమాజంలోని మధ్యతరగతి కుటుంబ సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని మనోహరమైన నాటకాలుగా మలిచారన్నారు. 1400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. తెలుగు సినిమా గేయ రచయిత. సంభాషణ కర్త. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపు తిప్పారన్నారు. నంది అవార్డు గ్రహీత. ఉత్తమ గేయ రచయిత. గౌరవ డాక్టరేట్. 1951లో సినీరంగ ప్రవేశం చేశారని తెలిపారు.వీరు రాసిన పాటలలో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావన ఉండడం వలన మనసుకవి,  మన ‘సు’ కవి అయ్యాడన్నారు. 13 సెప్టెంబర్ 1989లో ఆత్రేయ మరణించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరి రమేష్ (దేవి మ్యాచింగ్ సెంటర్ నిర్వాహకుడు) కండక్టర్ నర్సయ్య, కేశపురం సుమన్, పిట్టల సందీప్, బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article