28.8 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది

Must read

📰 Generate e-Paper Clip

  • కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చింది
  • రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

మోర్తాడ్, బతుకమ్మ : ఒక్క సంచి యూరియా కోసం చెప్పులు, పట్టా పుస్తకాలు  లైన్లో పెట్టి గంటలు తరబడి నిలబడి రైతులు తీవ్రమైన ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక్క యూరియా బస్తా కుడా దొరకని పరిస్థితి ఉంది.యూరియా కోసం BRS పార్టీ పక్షాన అసెంబ్లీ లో పోరాటం చేసినా, రాష్ట్ర వ్యాప్తంగారైతులు యూరియా కావాలని మొత్తుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి కి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది. రైతులు యూరియా కోసం అరిగోస పడుతుంటే కనీసం ఈ ప్రభుత్వలో చలనం లేదు. అటు రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇటు బాల్కొండ నియోజకవర్గం లో యూరియా కొరత ఉంది. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం గిరిజన ప్రాంతాల్లో మరియు మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో యూరియా కోసం రాత్రంబవళ్ళు తిండి నిద్రా హారాలు మాని రైతులు పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కి ఓటేస్తే పాత రోజులు వస్థాయని కేసీఆర్ గారు ఎప్పుడో అన్నారు. కేసీఆర్ అన్న మాటనే నిజమైంది అని ఇప్పుడు రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేసాం అని బాధపడుతున్నారు రైతులు. కేసీఆర్ రాకున్నా మొదలు ఏ పరిస్థితులు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మళ్ళీ అవే పరిస్థితులు వచ్చాయి. వరి పొట్ట దశకు వస్తున్నది..ఈ రెండు మూడు రోజుల్లో యూరియా అందకపోతే దిగుబడి రాదు. రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మక్కలు పూర్తి కావాచ్చింది.. పసుపు కు పోటాష్, యూరియా కలిపి వెయ్యాలి. వరికి యూరియా సక్కగా ఇవ్వటం లేదు మరి  పసుపు  పరిస్థితి ఏంటి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనాడు అనేక ఆగం మాటలు మాట్లాడినారు. మాది రైతు ప్రభుత్వం అని మోసం మాటలు చెప్పారు.కాని ఇది రైతు రాజ్యం కాదు దగా రాజ్యాంగ మారింది. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీ పూర్తి గా చేయకుండా రైతులను మోసం చేసారు.15000 రైతు భరోసా అని చెప్పి ఉన్న రైతుబందు ఎగొట్టారు. వడ్లకు 500 బోనస్ అని చెప్పారు దాని ఊసే లేదు. వ్యవసయానికి  24 గంటల కరెంట్ అని చెప్పి రోజు నాలుగైదు సార్లు కోతలు పెడుతున్నారు. ఒక్క యూరియా బస్తా ఇయ్య చాతకాదు కానీ లక్ష యాభై వేల కోట్లతో మూసి రివర్స్ ఫ్రంట్ చేస్తా అంటాడు. రైతులకు ఒక్క యూరియా బస్తా ఇయ్య చేత కాదు కానీ లక్షల కోట్లతో ఫ్యూచర్ సిటీ కడుత అంటాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వి అన్ని బుడ్డర్ ఖాన్ మాటలు, లఫంగి మాటలు జిల్లా వ్యవసాయ అధికారి తో క్షేత్ర స్థాయి AO లతో రిపోర్ట్ తెప్పించుకుంటే .. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి. యూరియా కోసం నీలదీస్తే కేంద్ర ప్రభుత్వం పై నెపం నెట్టుతున్నారు.. అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేద్దాం అని Brs పార్టీ పక్షాన మేము వస్తాం అని అసెంబ్లీ లో చెపితే మోడీ ని నిలదీసే ధైర్యం లేదు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేయడానికి సమయం లేదు కానీ నిత్యము కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై  తిట్టడానికి సమయం ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై కమీషన్ ల పేరు మీద ఎంక్వయిరీ ల పేరు మీద  అక్రమ కేసులు పెట్టి ఎట్లా జైల్లో వేద్దామా అన్న ఆలోచన తప్ప రేవంత్ రెడ్డి కి రైతుల ఇబ్బందులపై ఆలోచించే శ్రద్ద లేదు. హామీల అమలు గురించి అడిగితే కేసీఆర్ అప్పులు చేసిండు అని మాట్లాడుతున్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గత 10 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం 2 లక్షల 80 వేల కోట్ల అప్పు మాత్రమే  చేసింది అని చెప్పింది. కేసీఆర్ చేసిన అప్పుతో మిషన్ భగీరత, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రోడ్లు, బ్రిడ్జి లు, భవనాలు, హాస్పిటల్స్ ఇలా అనేక పనులు చేపట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు ఏండ్లలోనే 2 లక్షల 20 వేల కోట్లు అప్పు చేసి తట్టేడు మట్టి తీసావా ఎక్కడైన, ఒక్క ప్రాజెక్ట్ కట్టావా, ఒక్క గుంత అయినా పూడ్చావా  ఎం చేసావు  రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు  అడుగుతున్నారు సమాధానం చెప్పు మహిళలకు 2500 ఏమయ్యాయి, తులం బంగారం ఎక్కడ పోయింది,ఇంట్లో అవ్వ తాత లకు ఇద్దరికీ ఇస్తామన్నా 4000 పెన్షన్ ఏమైంది.ఇప్పటి కైనా కమిషన్ లు తీసుకునుడు ఢిల్లీకి మూటలు పంపుడు లాంటి పనులు, బుడ్డర ఖాన్ మాటలు మాట్లాడటము అపి పాలనా మీద ద్రుష్టి పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం.రైతులకు సరిపడా యూరియా అందజేయాలనీ ప్రభుత్వాని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతులు మహిళ లతో కలిసి ప్రభుత్వం పై పోరాడుతాము.

More articles

Latest article