- ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యూల్
బతుకమ్మ, బిచ్కుంద : వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యూల్ పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ ను అడ్డుకునే మాలలకు డబ్బులు ఉంటే సాధించుకునే మాదిగ లకు డప్పులు ఉన్నాయని అన్నారు. ఈనెల 25 న కామారెడ్డిలో లక్షడప్పులు వేల గొంతుల సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో జరిగే లక్షడప్పులు వేల గొంతులు మండే మాదిగ ల గుండెచప్పుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాల్లో జరుగుతున్న సన్నాహక సదస్సు ల్లో భాగంగా ఈనెల 25 న కామారెడ్డిలో సన్నాహక సదస్సు నిర్వహించడం జరిగుతుందని దాని విజయవంతం చేయడానికి జిల్లా లోని యావత్తు మాదిగ జాతి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని గత ఆగష్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపన్న మాల వర్గాల కొమ్ము కాస్తున్నాడని అన్నారు. మాల సంపన్నులకు డబ్బులు ఉంటే మాదిగ లకు డప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తుంచు కోవాలని లక్ష డప్పులతో వేయి గొంతులతో మాదిగ ల సత్తా,తడాఖా చూపిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కొత్తోల్ల యాదగిరి మాదిగ, మహిళా విభాగం నాయకులు సట్టిగారి లక్ష్మి మాదిగ, బానపురం లావణ్య మాదిగ, కాస్తారి శైలేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ కన్వీనర్ గోనె సురేష్ మాదిగ, గోనె నాగయ్య, సాయిలు, లక్ష్మణ్ మాదిగ హన్మాండ్లుమాదిగ, నరహరి గంగాధర్ జగదీష్ నాగేశ్వరరావు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
