వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల కార్యక్రమాన్నివిజయవంతం చేయండి
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యూల్ బతుకమ్మ, బిచ్కుంద : వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యూల్ పిలుపునిచ్చారు. బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణ ను అడ్డుకునే మాలలకు డబ్బులు ఉంటే సాధించుకునే మాదిగ లకు డప్పులు ఉన్నాయని అన్నారు. ఈనెల 25 న కామారెడ్డిలో లక్షడప్పులు వేల గొంతుల సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు....