27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థి దశలో ఉండే పిల్లలకు అవగాహన కోసమే శీతాకాల ప్రత్యేక శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్రవంతి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

శీతాకాల ప్రత్యేక శిబిరం ద్వారా విద్యార్థి దశలో ఉండే పిల్లలకు అవగాహనతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి కమ్యూనిటీ సర్వీస్ యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలుస్తుందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి స్రవంతి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం యూనిట్ 4 ఆధ్వర్యంలో శనివారం శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రొఫెసర్ జి రాంబాబు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ ఈ ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు, మూఢనమ్మకాల నివారణ, సేవాభావము, వయోజన విద్య, అక్షరాస్యత, న్యాయచైతన్యము, స్వయం సహాయక సంఘాల ఆవశ్యకత, బాల కార్మికుల నివారణ, మద్యపానము, ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ శిబిరం ఈనెల 13 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్లీ నగర్ తండా సర్పంచ్ విజయ్, ఉపసర్పంచ్, వీడిసి చైర్మన్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article