28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సుద్ధపల్లి గ్రామంలో శీతాకాలం ప్రత్యేక శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సుద్ధపల్లి గ్రామంలో జాతీయ సేవా పథకం (యూనిట్ 1, తెలంగాణ యూనివర్సిటీ) ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని శనివారం ప్రొఫెసర్ జి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ ప్రత్యేక శిబిరం ద్వారా గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పాటు, మూఢనమ్మకాల నివారణ, సేవాభావము, వయోజన విద్య, అక్షరాస్యత, స్వయం సహాయక సంఘాల ఆవశ్యకత, బాల కార్మికుల నివారణ, ధూమపానము, మద్యపానము వల్ల కలిగే నష్టాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ శీతాకాల ప్రత్యేక శిబిరం ద్వారా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకి కమ్యూనిటీ సర్వీస్ యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత అవగతమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ శిబిరం ఈ నెల 13 వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పానుగంటి రూప, సతీష్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article