. . . జక్రాన్ పల్లి సబ్ స్టేషన్ లో 0.8 మెగావాట్ల ప్లాంట్ ను ప్రారంభించిన సీయండి
జక్రాన్ పల్లి, బతుకమ్మ:
నిజామాబాద్ సర్కిల్‌లో టీజీ ఎన్‌పీడీసీఎల్ ద్వారా స్థాపించబడిన తొలి సౌర విద్యుత్ ప్లాంట్ సేవలను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నిజామాబాద్ సర్కిల్ డిచ్‌పల్లి డివిజన్ పరిధిలోని 33/11 కేవీ జక్రాన్‌పల్లి సబ్‌స్టేషన్‌లో 0.8 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళ వారం టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా సీయండి మాట్లాడుతూ… 0.8 మెగావాట్ (ఏసీ) సామర్థ్యం గల గ్రౌండ్ మౌంటెడ్ సౌర ఫోటోవోల్టాయిక్ విద్యుత్ ప్లాంట్ ఏప్రిల్ 11న సాంకేతికంగా ఛార్జ్ చేసి , విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని చెప్పారు .

నిరంతర విద్యుత్ ఉత్పత్తి కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుందని , కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని చెప్పారు . విద్యుత్ గ్రిడ్‌కు సుమారు 43 ఆంపియర్లు లోడ్ ఇంజెక్ట్ చేస్తున్నామని చెప్పారు . పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతూ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి టీజీ ఎన్‌పీడీసీఎల్ ముందడుగు వేస్తోందని వివరించారు . . ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ/ఆపరేషన్స్/నిజామాబాద్ పి.వి రాజేశ్వర రావు , డీఈ/కన్స్ట్రక్షన్/నిజామాబాద్ డి వెంకటరమణ, డీఈ/ఆపరేషన్స్/డిచ్‌పల్లి హరిచంద్, ఏడీఈలు, తోట రాజశేఖర్, ఆర్ బాలేష్ కుమార్, కె నటరాజ్, బాలచందర్, ఏఈలు డి ప్రవీణ్ కుమార్, ఏ కాశీనాథ్, సాయిలు, భవిత తో పాటు ఎంఆర్‌టీ, ఆపరేషన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

