- లోతుగా విచారణ చేపడుతున్న వైద్యారోగ్య శాఖ
- కేసును పక్కదారి పట్టించేందుకు ఎత్తుకు ఫై ఎత్తులు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డంగా దొరికి పోతున్నారు అగంతకులు. కడుపులో పెరిగేది ఆడబిడ్డ మగ బిడ్డ అని చెబుతూ పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. గతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన మరువకముందే తాజాగా రాజంపేట మండల కేంద్రంలో లింగ నిర్ధారణ చేస్తూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డ విషయం విధితమే. అయితే కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు చేస్తూ అడ్డంగా దొరికిన విషయం రాష్ట్రంలో జిల్లాలో కలకలం రేపింది. లింగ నిర్ధారణ పరీక్షలు వెలుగులోకి వచ్చిన తర్వాత గ్రామంలో గల ఆశ ఆరోగ్య కార్యకర్తలు సహకారం విషయంపై జిల్లా ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. గత రెండు రోజులగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ఆశా వర్కర్లకు సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో వారి హస్తం ఉన్నదా? అధికారులు ఆదేశాల మేరకు వైద్య శాఖ సిబ్బంది విచారణ లోతుగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంత కాలం నుంచి జరుగుతుంది? ఎవరెవరు సహకరిస్తున్నారు? అంటూనే గత మూడు సంవత్సరాల ఆశా ఆరోగ్య కార్యకర్తల డాటా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత తాజాగా.. మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వేర్వేరుగా దర్యాప్తు చేసిన పోలీసులు, వైద్యాధికారులు.. నిందితులు చెప్పిన వాస్తవాలతో షాక్ అయ్యారు. మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 35కు పైగా అబార్షన్లు చేసినట్లు తేల్చారు. ఈ ముఠా.. లింగ నిర్ధారణకు 15 వేలు.. అబార్షన్‌కు 70 వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా.. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట్ పీహెచ్సీ కేంద్రంగానే లింగ నిర్ధారణ టెస్టులు జరిగినట్లు… కొందరు వైద్య శాఖ సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. పోలీసు ఎంక్వైరీ తర్వాతే ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందన్నారు రాజంపేట్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ విజయమహాలక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించి గతంలో ఓ సారి డీఎంహెచ్‌వో హెచ్చరించడడంతో అప్పటినుంచి అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. సబ్ సెంటర్ల నుంచి అబార్షన్ లిస్టులు తీసుకున్నామని.. కానీ.. వాటిలో ఇలాంటి కోణాలు లేవని.. సాధారణంగా జరిగిన అబార్షన్లే రెండు, మూడు గుర్తించామని తెలిపారు.ఇది ఇలా ఉండగా గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాతో పాటు పలు టీవీ ఛానల్ లో కథనాలు రావడంతో రాజంపేట మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది ఏం జరుగుతుంది అంటూ ఆ నోట ఈ నోట చర్చ కొనసాగుతుంది. ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు ఎలా చేస్తారు ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగం పైన చర్యలు తీసుకుపోవడం వెనుక మౌనం ఏమిటి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసును నీరుగారిచేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మామూళ్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసును రాష్ట్ర ఉన్నత అధికారులకు చేరవేయకుండా తప్పుడు సమాచారం అందించి జిల్లా అధికారులతో పాటు మండలానికి చెందిన కొందరు అధికారుల అండాతో కేసును నీరుగారిచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈపాటికి కొందరికి ముడుపులు అందినట్లు బహిరంగ విమర్శలు వినబడుతున్నాయి. సంపాదించింది కొండంత అయితే కేసు నీరు గారిచేందుకు చీమంత ఖర్చు పెట్టిన పర్వాలేదు తమకు అడ్డు ఎవరంటూ దర్జాగా విమర్శలు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.