కేసులకు జడవని స్కానింగ్ మాఫియా
లోతుగా విచారణ చేపడుతున్న వైద్యారోగ్య శాఖ కేసును పక్కదారి పట్టించేందుకు ఎత్తుకు ఫై ఎత్తులు కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డంగా దొరికి పోతున్నారు అగంతకులు. కడుపులో పెరిగేది ఆడబిడ్డ మగ బిడ్డ అని చెబుతూ పసి మొగ్గలను చిదిమేస్తున్నారు. గతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఘటన మరువకముందే తాజాగా రాజంపేట మండల కేంద్రంలో లింగ నిర్ధారణ చేస్తూ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డ విషయం విధితమే. అయితే కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు...