హామీలను అమలు చేయించాలని గాంధీ విగ్రహానికి వినతి
భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసేలా బుద్దినివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.గురువారం గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులార్పించిన బీయర్ఎస్ శ్రేణులు హామీల అమలు జాప్యం పై నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటిలు, 420 హామీలను అమలు చేస్తామని దేవుళ్లపైన ఒట్టు పెట్టి చెప్పి ఇప్పటికి అధికారం లోకి వచ్చి 420...