26.3 C
Hyderabad
Monday, August 3, 2026

లయన్ శ్యామ్ సుందర్ పహడేను వరించిన ఇంటర్నేషనల్ అరుదైన గౌరవం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామ వాసి లయన్ శ్యామ్ సుందర్ పహడేకు అరుదైన రాక్ స్టార్ అవార్డ్, ఇంటర్నేషనల్ సర్టిఫికెట్,  ఇంటర్నేషనల్ పిన్ కు ఎంపిక చేసి అవార్డ్ ని ప్రదానం చేశారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. 216 దేశాలలో ఉన్న లయన్స్ క్లబ్స్ లలో కేవలం కొంతమందికి మాత్రమే అరుదైన గౌరవం లభించిందన్నారు. ఇందులో లయన్ శ్యామ్ సుందర్ పహడే కు సెలెక్ట్ చేసిన లయన్స్ ఇంటర్నేషనల్ రాక్ స్టార్ అవార్డ్ సెలెక్ట్ అయిన దాంట్లో లయన్ శ్యామ్ సుందర్ పహడే ఒకరని ఇలాంటి అరుదైన గౌరవంకు ఎంపికవడానికి ముఖ్య కారణం లయన్స్ క్లబ్స్ లో ఎనలేని సేవ కార్యక్రమాలు చేయడం మెంబర్షిప్ గ్రౌత్ ని పెంచడం, ఇతర అన్ని రంగాలలో నిస్వార్థ సేవ చేసినందుకు గాను అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు.  అమెరికాలోని ఓర్లాండో ఫ్లోరిడా దేశంలో జులై మాసంలో లయన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఇవ్వవలసిన ఈ ప్రత్యేక అవార్డ్ ని అవార్డ్ గ్రహీత అమెరికాకు రాకపోవడంతో గురువారం లయన్స్ కంటి ఆసుపత్రిలో జరిగిన అంతర్జాతీయ గ్యాట్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లోని ఉత్తమ హోదాలో ఉన్న లయన్స్ సభ్యుల సమక్షంలో ఇవ్వడం జరిగిందని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తాజా మాజీ డైరెక్టర్, లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ లయన్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article