28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జన విజ్ఞాన వేదిక తెలంగాణ వార్షిక సమీక్ష సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక తెలంగాణ, నిజామాబాద్ జిల్లా కమిటీ 5వ వార్షిక సమీక్ష సమావేశం గురువారం లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జేవీవీ జిల్లా అధ్యక్షులు ఖాజా ఒమర్ అలీ అధ్యక్షత వహించగా, జేవీవీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి యం.యస్. శ్రీహరి ఆచార్య , అశోక్ భాగ్యవాన్, తుక్కడి నారాయణ లు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో జేవీవీ నిజామాబాద్ జిల్లా వార్షిక నివేదికను ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్ ప్రవేశ పెట్టగా, జిల్లా ఆర్థిక నివేదికను, జిల్లా కోశాధికారి కల్గె పండరి ప్రవేశం పెట్టారు. ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన జిల్లా కార్యదర్శి నివేదిక పై, అలాగే కోశాధికారి ప్రవేశ పెట్టిన జిల్లా ఆర్థిక నివేదిక పై.. సమావేశానికి హాజరైన సభ్యులు చర్చించి వాటిని ఆమోదించారు.

Jan Vigyan Vedika Telangana Annual Review Meeting

More articles

Latest article