అంతర్ జిల్లా కబడ్డీ క్రీడల ప్రారంభం

0 17,470

ముప్కాల్, బతుకమ్మ : ముప్కాల్ మండల కేంద్రంలోని జీఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లోనిర్వహిస్తున్న నునుగొండ శ్యామల మెమోరియల్ 35 వ జూనియర్ అంతర జిల్లాల బాల, బాలికల కబడ్డీ ఛాంపియన్ షిప్ క్రీడలను  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాగడాను వెలగించి పట్టుకొని లంచనంగా క్రీడాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా పక్క మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య, మనుషుల మధ్యన స్నేహ భావం పెంపొందుతుందన్నారు. క్రీడలు మనిషికి ఎన్నో విధాల ప్రయోజనాలు . ప్రశాంత వాతావరణంలో క్రీడాలను నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే క్రీడకారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.