28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన కనబరచాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదుపై సత్వర స్పందన కనబరిచి పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర అన్నారు. జిల్లాలో శనివారం నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. భిక్కనూర్ ఎస్హెచ్ఓ ఎస్.అనిల్, రాజంపేట ఎస్హెచ్ఓ డి.ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్హెచ్ఓ కె.విజయ్, బీబీపేట ఎస్హెచ్ఓ నవీన్ చంద్ర, బాన్సువాడ ఎస్సై శిరీష తమ కొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీని కలిసి ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, బాధ్యతాయుతమైన పోలీసు సేవలు అందించడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. అదే విధంగా విధుల నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నూతన అధికారులకు సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

More articles

Latest article