24 C
Hyderabad
Sunday, August 2, 2026

పిచ్చి కుక్కలకు కారుణ్య మరణమే!

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సుప్రీంకోర్టు కీలక తీర్పు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

దేశంలో పెరుగుతున్న వీధికుక్కల దాడులు, కుక్కకాట్ల ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రమాదకర వీధికుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ధర్మాసనం వీధికుక్క లపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు నిరాకరించింది. ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధికుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అనంతరం తిరిగి అదే ప్రాంతాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు మాత్రమే తరలించాలని ఆదేశించింది. వీధికుక్కల దాడుల నుంచి ప్రజలను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు విఫలమయ్యాయని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైకోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేసి అమలును పర్యవేక్షించాలని సూచించింది.

More articles

Latest article