నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలోని లైబ్రరీలో తాగునీటి సమస్య, వైఫై సమస్య తీర్చాలని గిరిజన శక్తి ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ గిరిజన శక్తి ప్రెసిడెంట్ శ్రీను రాథోడ్, వైస్ ప్రెసిడెంట్ సంజు నాయక్, శ్రీకాంత్, శేఖర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
