చీతా ఫోర్స్ దాడిలో ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్న భారీ లారీ స్వాధీనం
వేల్పూర్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రత్యేక ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చీతా ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక భారీ 14 టైర్స్ లారీని గుర్తించి వెంటనే పట్టుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ లారీ ద్వారా...