- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దళితుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసి సమాజంలోని అంటరానితనం అసమానతలు రూపుమాపుటకు ఎంతో తోడ్పడిన ఘనత డా. బి.ఆర్. అంబేద్కర్ కు దక్కుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం పోలీస్ శాఖ ఆద్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికి తన అపార మేధాశక్తులతో సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు పాటుపడిన మహనీయుడని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువరానివని తెలిపారు. ప్రపంచ దేశాలలోనే కీర్తించబడే అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్య విలువలను పెంపొందించి, దళితులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి విస్తరంగా ప్రచారంచేసి వాటిని సద్వినియోగపరిచే విధంగా ప్రతిఒక్కరు కృషి

చేయాలని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ అందించిన ఫలాలతో నేడు అణగారిన వర్గాలు రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతు సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందెందుకు ఎంతో కృషిచేసిందని అన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే ప్రస్తుతం దేశంలోచట్టాలు సమర్ధవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరు డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని, అగ్ర వర్ణల దాడులకు గురైన బాదితులకు సత్వరన్యాయం అందించేందుకు ” పోలీస్ శాఖ” నిరంతరం చిత్త శుద్దితో కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ( స్పెషల్ బ్రాంచ్ ) శ్రీనివాస్ రావ్ , నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, వనజ రాణి, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ శేఖర్ బాబు ( ఎంటీఓ), శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్) , సతీష్ (హోమ్ గార్డ్స్) ఐ.టి కోర్ సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.

