27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్  మండలంలో  మామిడిపల్లి గుత్ప కల్లేడి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయ్యంది.అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకపక్క అకాల వర్షాలు మరో ప్రక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం చోరువ తీసుకుని  కొనుగోలు చేస్తారో లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు పండించిన దాన్యం నీటిపాలవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో మండలంలోని చాలా గ్రామాల్లో దాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి చేతికొచ్చిన సమయంలో ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక సహకార సంఘ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గ్రామాల్లో దాన్యం నెలల తరబడి ఎక్కడకక్కడ నిలిచిపోయి ఈ అకాల వర్షాలకు తడిసి ముద్ద అవుతున్నాయి. బుధవారం కురిసిన వర్షానికి ధాన్యాన్ని ఆరబోయడంతో గురువారం మరింత వర్షం కురవడంతో గ్రామాల్లో దానం చాలావరకు  తడిసిపోయింది. అష్ట కష్టాలు పడి ఆరుగాలం పండించిన పంట కళ్ళముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. మండలంలోని ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది నిర్లక్ష్యంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదో అని రైతుల ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా రైతులను ఆదుకొని తడిసిన ధాన్యాన్ని  తరుగు లేకుండా మిల్లర్లకు తరలించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని తక్షణమే రైతుల ధాన్యాన్ని తరలించని ఎడల  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాళ్లకు బోనస్ ప్రకటించి ఇంతవరకు వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిలిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  సిపిఎం పార్టీ సభ్యుడు కటారి రాములు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు రాజు సుమన్ మహేష్ రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article