25.6 C
Hyderabad

సమగ్ర కుటుంబ సర్వేను సక్రమంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • – జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్

రుద్రూర్, బతుకమ్మ  : సమగ్ర కుంటుంబ సర్వేను తప్పులు లేకుండా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో సామాజిక ఆర్థిక సర్వేను బుధవారం నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ సురేష్ బాబు, సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్, పంచాయతీ సెక్రటరీ తదితరులు ఉన్నారు.

More articles

Latest article