29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్యారంటీలు నెరవేర్చకుండా ప్రజాపాలన సంబరాలా

Must read

📰 Generate e-Paper Clip

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూర్ణానందం

బతుకమ్మ,ఏర్గట్ల: ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట శనివారం ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజా ప్రజా పరిపాలన విజయోత్సవ సభను నిర్వహించడం విడ్డూరంగా ఉందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఈరోజు వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ప్రజలకు అందలేదని అన్నారు. అధికారంలోకి రాగానే వెంటనే కళ్యాణ లక్ష్మికి కేసిఆర్ ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు మాత్రమే ఇస్తుంది మేమైతే లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఇచ్చారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ 100% పూర్తి చేసినందుక ,లేదా మహిళలందరికీ ఇంట్లో ఎన్ని పెన్షన్లు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా సరే 2500 రూపాయల పెన్షన్ ఈ క్షణం వరకు ఇచ్చినందుక లేదా డిగ్రీ పూర్తయి పీజీ చదువుతున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇచ్చినందుగా విజయోత్సవాలు అని ప్రశ్నించారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లా ద్వారా వచ్చిన 30వేల కు పైగా ఉద్యోగాలు మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అని అబద్ధాలు చెప్పినందుకా,ఇల్లు లేని నిరుపేదలకు కేసిఆర్ అయితే 3 లక్షలు ఇస్తా అంటున్నాడు అదే నేను అధికారంలోకి వస్తే వెంటనే 5,లక్షలు ఇండ్ల నిర్మాణం కొరకు ఆర్థిక సహాయాన్ని అందజేసినందుకా , అదేవిధంగా ఎన్నికల హామీల్లో దొడ్డు, సన్న, అని చెప్పకుండా ప్రస్తుతం  తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అబద్ధం ఆడి అది సన్నా వడ్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇవ్వడం పూర్తయినందుకా, ఇట్లా చెప్పుకుంటావోతే శాంతాడు అంత పెద్ద హామీలను పూర్తి చేసినందుక ఎందుకు ప్రజా పాలన విజయోత్సవ సభలు కాంగ్రెస్ నాయకులు ఫ్రీ బస్ ఇచ్చిన కాంగ్రెస్ బిజెపి దద్దమ్మలకు కనిపిస్తే లేదా అని మాట్లాడడం వారి అవివేగానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఏర్గట్ల మండలంలోని తాల్లరాంపూర్, గుమ్మిర్యాల, దోన్ చంద గ్రామాలకు మెట్ పల్లి నుండి గంటకు ఒక బస్సు చొప్పున ఉండేది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత బస్సు దెబ్బకు మెట్ పల్లి నుంచి వచ్చే బస్సు ఒకటి మాయమైపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article