గ్యారంటీలు నెరవేర్చకుండా ప్రజాపాలన సంబరాలా
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూర్ణానందం బతుకమ్మ,ఏర్గట్ల: ప్రజా పాలన విజయోత్సవ సభల పేరిట శనివారం ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది ప్రజా ప్రజా పరిపాలన విజయోత్సవ సభను నిర్వహించడం విడ్డూరంగా ఉందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఈరోజు వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా ప్రజలకు అందలేదని అన్నారు. అధికారంలోకి రాగానే వెంటనే కళ్యాణ లక్ష్మికి కేసిఆర్ ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు మాత్రమే...