బతుకమ్మ, భిక్కనూరు : నియోజకవర్గం లోని దేవాలయాలకు కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాలలో దేవాలయాల కుల సంఘాల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా తన సొంత నిధులతో కుల సంఘాలకు దేవాలయాల అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాకపోయినా తన సొంత డబ్బులతో కుల సంఘాలను దేవాలయాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామంలో తన సొంత నిధులతో హనుమాన్ టెంపుల్ కు నిధులు ఇవ్వడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భిక్కనూరు మండల ఇన్చార్జి శ్రీధర్ బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ గ్రామ అధ్యక్షుడు పురుషోత్తం, హరేంద్ర, పవన్, సాయి, ఆనంద్ రాకేష్ ఆదర్శ్ గ్రామ ప్రజలు ఉన్నారు.
