వెబ్ డెస్క్, బతుకమ్మ :
రాజస్థాన్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి షికార్ అగర్వాల్ కుటుంబ సభ్యులకు మొత్తం కలిపి 40 విల్లాలు ఉన్నాయి. వీటిని రెండున్నర సంవత్సరం వ్యవధిలోని కొన్నారు. .ఇంకో సంచలనమైన విషయం ఏమిటంటే ఆయన భార్య ప్రశాక మాధుర్.. ఆమె కూడా ఐపిఎస్ అధికారి . ఇద్దరు కలిపి 40 విల్లాలు కొనుగోలు చేశారంటే దాదాపు వాటి విలువ ఎంత అన్నది చెప్పలేరు. వాటిని మళ్ళీ ఆ కంపెనీకి లీజుకు ఇచ్చారు. దీంతో ఆయనను ప్రస్తుతం ఉన్న అడిషనల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారు. ఏ బాధ్యతలు ఇవ్వకుండా ఖాళీగా పెట్టారు. అనేకమైన కీలక శాఖలలో ఐఏఎస్ అధికారిగా ఆయన పని చేశాడు. వాటిలో కొన్ని ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ చైర్మన్ గాను, స్పెషల్ ఏరియా అథారిటీ చైర్మన్ గాను, రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా, రాజస్థాన్ పెట్టుబడులు సంస్థకు చైర్మన్.. ఇలా అనేక హోదాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి ఆయన . భార్య కూడా ఐపీఎస్ ఆఫీసర్ .. మరి ఆ మాత్రం 40 విల్లాలు తమ పేర్లతో , బంధువుల పేర్లతో కొనక పోతే నేటి కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ పదాలకు అర్ధం ఉందా??
