28.6 C
Hyderabad

పాత వీడియోలకు కొత్త టైటిల్ పెడుతున్నారు

They are giving new titles to old videos.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఓట్లు వేసినా వేయకున్నా బీజేపీ గెలుస్తదని నేనే అన్నా

 

. . . బడుద్దాయి కేటీఆర్ కు నా గురించి ఎంత వెతికినా తప్పులే దొరకవు

 

. . . ఎంపీ అర్వింద్ ధర్మపురి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కు, కల్వకుంట్ల కుటుంబానికి హీనమైన చరిత్ర ఉందని వారు చేసిన దోపిడిలు, పాపలు మరెవ్వరు చేయలేరని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో తన పేరుతో పోస్టు చేసిన వీడియోలపై కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, కేసీఆర్ కుటుంబం చేసిన మోసాల, పాపల హిస్టరీ ఉందన్నారు. 2024 ఎన్నికల సమయంలో మైనార్టీలతో ముఖ్యంగా ఉర్ధూ జర్నలిస్టులతో ప్రెస్ మీట్ లో నేను చేసినట్లు వ్యాఖ్యల పాత వీడియోలను కొత్త టైటిళ్ళతో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని అన్నారు. కేటీఆర్ కు తనను టార్గెట్ చేయాలని ఎంతో వెతుకుతున్నారని కానీ తాను తప్పు చేయలేదని అందుకే పాత వీడియోలకు కొత్త టైటిళ్ళు పెడుతున్నారని విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను ఓడించిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి పారిపోయిందని అందుకు కేటీఆర్ కారణమన్నారు. తాను 2024 ఎన్నికల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముస్లీంలకు మోడి ప్రభుత్వం హయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు, ఉచితంగా రేషన్ బియ్యం, ఉచిత విద్య, వైద్యం అందుతున్నాయని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఓటు వేయాలని అడిగింది వాస్తవమేనన్నారు. మైనార్టీలు ఓట్లు వేసినా, వేయకపోయినా తాను గెలుస్తానని ఆనాడు చెప్పానని, ఈనాడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. తాను అనని మాటలను ఎవరికి ఓట్లు వేసినా అవి బీజేపీకే పడుతాయని అన్న వ్యాఖ్యలు తాను చేయలేదని గుర్తు చేశారు. తాను ఆనాటి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యల గురించి ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాలసిన అవసరం లేదన్నారు. మోడి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్య, వైద్యంను ఆనాడు కేసీఆర్ అనే బడుద్దాయి అమలు చేయలేదని ప్రస్తుతం ఉన్న మరో బడుద్దాయి కూడా దానిని రాష్ట్రంలో కొనసాగించడం లేదని అరవింద్ విమర్శించారు.

More articles

Latest article