26.2 C
Hyderabad

జగిత్యాల జిల్లాలో కలకలం

Sensation in Jagtial district

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  కుటుంబంతో సహా ఆత్మహత్యకు అనుమతివ్వాలని ప్రజావాణిలో వినతి

 

జగిత్యాల, బతుకమ్మ :

 

జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మ్యాడ గోవర్ధన్ తనకు న్యాయం జరగడం లేదంటూ భార్య, పిల్లలతో కలిసి ప్రజావాణిని ఆశ్రయించాడు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మెట్‌పల్లి–వెల్లుల్ల రోడ్డులో 2021లో నలుగురు భాగస్వాములతో కలిసి తనకు చెందిన షట్టర్‌లో మెడికల్ షాపు ఏర్పాటు చేసినట్లు గోవర్ధన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం ఐదేళ్ల గడువు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా షాపును తనకు తిరిగి అప్పగించడం లేదని ఆరోపించాడు. షాపును అప్పగించాలని భాగస్వామి సంతోష్‌ను కోరగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీంతో షాపు వద్దకు వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేసి, సమస్యను పరిష్కరించాలని గోవర్ధన్ అధికారులను వేడుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

More articles

Latest article