24.1 C
Hyderabad

కళ్ళముందు కనిపించే దేవుళ్ళు వైద్యులు

Doctors are the gods we see before our eyes.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

 

. . . వైద్య రికార్డులు భవిష్యత్ కు భద్రత.. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి

 

. . . వృత్తిలో సమతూకం ఉంటేనే సమస్యలు ఉండవు..అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్

 

. . . నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్లకు నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో వక్తలు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ  :

 

వైద్య నిపుణులు తమ వృత్తులలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ తెలిపారు. అనారోగ్యంతో డాక్టర్ల దగ్గరకు వస్తున్న, వెళుతున్న ప్రతి పేషంట్ వృత్తిలో ఒక అనుభవసారమేనని ఆమె అన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని సమావేశపు హల్ లో “ఆరోగ్య సంరక్షణ నిపుణులు,  క్లినికల్ సంస్థల(హింస నివారణ) బిల్ -2025 మెడికల్ డాక్యూమెంటైజేషన్ “అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని సహచర అదనపు జిల్లాజడ్జిలు సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్, అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్, ట్రైని కలెక్టర్ సురేష్,డిస్ర్టీక్ మెడికల్ అండ్ హెల్త్ ఆపీసర్ రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల విశాల్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి, డిసిహెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్ లతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం ఆమె వైద్యులనుద్దేశించి ప్రధానోపన్యాసం చేశారు.ఆసుపత్రులకు వచ్చిన రోగుల రికార్డులను జాగ్రత్తగా నమోదు చేసుకొని కాపాడుకోవాలని అన్నారు. వైద్యులుగా మనసుపెట్టి వైద్యం చేశాము అన్నది ముఖ్యమే అయిన దానికంటే ముఖ్యం రోగికి సంబందించిన వైద్య రికార్డులు మెయింటైన్ చేసుకోవాలని జిల్లాజడ్జి భారత లక్ష్మీ పేర్కొన్నారు. వైద్య వృత్తిలో తప్పటడుగులు వేయరాదనీ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సుతిమెత్తని హెచ్చరికలతో కూడిన జాగ్రత్తలు ఉద్భీదించారు.రోగులకు వైద్యం చేయడంలో వైద్యుల పొరపాటు ఉంటే వినియోగ దారుల వివాదాల కమిషన్ లో నష్ట పరిహార దావాలను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంటుందని ఆమె తెలిపారు. ప్రయివేట్ వైద్యులైన ప్రభుత్వ వైద్యులైన రోగులకు సంబందించిన ప్రతి విషయాన్ని రికార్డు చేయాలని విన్నవించారు.డాక్టర్లు కళ్ల ముందు కనిపించే దేవుళ్ళు అని ఆరోగ్య కాపాడే విషయంలో నిర్లక్షానికి తావు ఇవ్వరాదని సూచించారు.సాంకేతిక యుగంలో సిసి టివి కెమెరాలు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నవేళలో జాగ్రత్తగా ఉండాలని మనల్ని ఎవరు గమనిస్తలేరు అనుకోరాదనీ ఆమె అన్నారు.వైద్యులు జారిచేసే డాక్యుమెంట్ చాలా ముఖ్యమైనదని ఒకవేళ కోర్టులలో సాక్ష్యాలు చెప్పడానికి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా దృవీకరించిన డాక్యుమెంట్స్ తీసుకుని రావాలని అన్నారు.”మరణపు చివరి అంచుల మీద ఉన్న వారి మరణ వాంగ్మూలాలకు చాలా విలువ ఉంటుందని అలాంటి వారి రికార్డులు భద్రపరచడంలో లోటుపాట్లు ఉండరాదనీ ” తెలిపారు.మెడికల్ రికార్డులు లేకుండా ట్రీట్మెంట్ చేయరాదని అలా చేస్తే చట్టం అనేది ఉన్నదని తెలుపుతు పిడుగు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రిమినల్ కేసులలో, మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార కేసులలో డాక్టర్లు కోర్టులలోకి వచ్చి సాక్ష్యం చెబుతారని కాని చాలా తెలివైన న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ను తట్టుకోవడం అంత సులువు కాదని అందుకే మెడికల్ రికార్డులు క్రమ పద్దతిలో రాసుకోవాలని అయిన ముప్పు ముంగిట ఉన్నట్లేనని అన్నారు.అడ్మినిస్ట్రేషన్ అఫ్ జస్టిస్ సిస్టమ్ లో నాలుగు స్థంబాలు పోలీసులు, డాక్టర్లు, న్యాయవాదులు ప్రాసిక్యూషన్, న్యాయస్తానాలు అని ఆమె తెలిపారు. వైద్యుల విలువైన పాత్ర బాధితులకు వారి కుటుంబాలకు మరెంతో విలువైనదని ఆమె విశ్లేశించారు.నేటి నుంచి నూతన వైద్య ప్రయాణానికి శ్రీకారం చుట్టుకుని ప్రయాణించాలని జిల్లాజడ్జి భారత లక్ష్మీ కోరారు. జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈలా త్రిపాఠి మాట్లాడుతూ వ్యవస్థలో వైద్యుల బాధ్యతే ఎక్కువని ఆరోగ్యకరమైన సమాజానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు.”ప్రజల నుండి కలెక్టర్ రావాలి.. కలెక్టర్ రావాలి అనే నినాదాలు వస్తున్నాయి” అవి ఎందుకు వస్తున్నాయో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వైద్యులు ఆలోచించాలని అన్నారు. సమాజం వైద్యుల నుండి చాలా ఆశిస్తుందని అందుకు తగ్గట్లుగా కలిసి పని చేద్దామని ఆమె తెలిపారు. రెండవ అదనపు జిల్లాజడ్జి సుగాలి నారాయణ లీగల్ ప్రొటెక్షన్ అఫ్ డాక్టర్స్ అనే అంశంపైన వివరిస్తూ చట్టం ఎంత కాపాడలో అంత కాపాడుతుందని శృతి మించితే నష్టం తప్పదని తెలిపారు. నాల్గవ అదనపు జిల్లాజడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మెడికల్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రొఫెషనల్ నెగ్లీజెన్సీ అంశంపై మాట్లాడుతూ వైద్యుల డాక్యుమెంట్లకు సాక్ష్యాలకు చాలా విలువ ఉన్నదని అన్నారు. ఇన్ పెషేంట్, ఔట్ పెషేంట్ ఆరోగ్యస్థితిగతులతో పాటు ఆరోగ్య పరీక్షలు, మెడిసిన్స్ ఉపయోగం వివరాల నమోదు రక్షణ కీలకమని అన్నారు.మెడికల్ లీగల్ కేసులలో క్లినికల్ రిపోర్టులు సరిగా ఉండే విదంగా చూసుకోవాలని అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్ అన్నారు. పెషేంట్ కు డాక్టర్ కు మధ్య చక్కని సంబంధాలే ట్రీట్మెంట్ కు గీటురాయిగా ఉండాలని తెలిపారు. క్రిమినల్ నెగ్లీజెన్సీ పనికిరాదని సిసి టివి తప్పనిసరిగా ఆసుపత్రులలో ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.డిఎమ్ హెచ్ ఒ రాజశ్రీ ఆసుపత్రుల తీరుతేన్నులను తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ముద్దసాని నీలిమ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహారించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి క్షత్రి ఉషా రాణి, సీనియర్ సివిల్ జడ్జిలు అజయ్ ఉల్లం, చైతన్య అంగరి,నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల విశాల్, డాక్టర్ దీపక్ రాథోడ్, న్యాయసేవ సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేధార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మహమ్మద్ షాదుల్ల, డాక్టర్లు పాల్గొన్నారు.

Doctors are the gods we see before our eyes.

More articles

Latest article