. . .అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్
.. చివర్లో తిలక్ వర్మ మెరుపులు
. . . ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
ఆసియా క్రికెట్ ఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న ఉత్కంఠభరిత ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు ఆరంభం నుంచి చివరి వరకు దూకుడు గా ఆడటంతో స్కోరు 200 పరుగుల మార్కును దాటింది.భారత ఇన్నింగ్ కు అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో బలమైన పునాది వేశాడు. పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడుతూ పాకిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అతని ధాటైన బ్యాటింగ్‌తో భారత స్కోరు వేగంగా ముందుకు సాగింది. మధ్య ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ 21, ఇషాన్ కిషన్ 20, శివమ్ దూబే 27 పరుగులతో కీలక సహకారం అందించారు. వీరి ఇన్నింగ్స్ లు భారత స్కోరును నిలకడగా కొనసాగించేందుకు ఉపయోగపడ్డాయి. అయితే ఇన్నింగ్స్ చివరి దశలో తెలుగు తేజం తిలక్ వర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతుల్లో 51 పరుగులు సాధించిన తిలక్ వర్మ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.కీలక సమయంలో వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన తిలక్ వర్మ అజేయంగా నిలిచి భారత స్కోరును భారీ స్థాయికి చేర్చాడు. చివరి ఓవర్లలో అతని ధాటైన బ్యాటింగ్‌తో భారత్ భారీగా పరుగులు రాబట్టింది.
