. . . కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
కామారెడ్డి, బతుకమ్మ :
“రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని, కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా పింఛన్ ఇప్పిస్తామని మీ నుండి డబ్బులు ఆశీస్తే, తక్షణమే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, దళారుల బారినపడి మోసపోవద్దన్నారు. “పింఛన్ల పంపిణీకి ఎలాంటి దళారులు అవసరం లేదని, కేవలం అర్హులైన వారికే పింఛన్ నేరుగా వారి ఖాతాలోకి అందుతుందని, మీ ఇంటికి అధికారులు వచ్చి ఆన్ లైన్ ఫోటో వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా డబ్బులు ఆశీస్తే వారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లేనని,””పేద ప్రజల పొట్టగొట్టి, ప్రభుత్వ పథకాలతో వ్యాపారం చేసే ఏ దళారీని, మధ్యవర్తిని కూడా క్షమించమన్నారు. నేరుగా మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేసిన వెంటనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
