29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్ లో బాలికల ఉన్నత పాఠశాల తనిఖీ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను మండల తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎంఈఓ రాజ గంగారం లు తనిఖీ చేశారు. గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  అధికారులు విచారణకు వచ్చి విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అధికారులను దానిపై ఆరా తీశారు.. పాఠశాలలో నిలువ ఉంచిన బియ్యం సంచులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై రిపోర్టును రూపొందించామని.. ఆ రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article