నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా కంటేశ్వర్ లోని నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాతృమూర్తి ఇటీవల మోకాలు కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి రత్నాకర్ మాతృమూర్తిని పరామర్శించారు. అదేవిధంగా నగరంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సందర్శించారు. కాళీ ప్రదేశంలో త్వరలోనే క్రీడాకారులకు ఉపయోగపడేలా స్టేడియం ను ఏర్పరిచేలా ప్రణాళికలను రూపొందించారు. అదేవిధంగా అక్కడే ఉన్న జర్నలిస్టులతో కలిసి మాట్లాడారు. జర్నలిస్టులకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు ఉన్న తన వద్దకు రావచ్చని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
