నగరంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సుడిగాలి పర్యటన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటగా కంటేశ్వర్ లోని నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మాతృమూర్తి ఇటీవల మోకాలు కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి రత్నాకర్ మాతృమూర్తిని పరామర్శించారు. అదేవిధంగా నగరంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సందర్శించారు. కాళీ ప్రదేశంలో త్వరలోనే క్రీడాకారులకు ఉపయోగపడేలా స్టేడియం ను ఏర్పరిచేలా ప్రణాళికలను...